కరోనాతో స్ట్రీమింగ్ పండగ

Digital streaming apps are getting benefited with corona
Tuesday, March 17, 2020 - 16:15

కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు ఇళ్లు కదలడం లేదు. బయట షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు కూడా క్లోజ్ అవ్వడంతో ఇక వాళ్లకు మిగిలిన ఏకైక ఆప్షన్ ఇంట్లో టీవీ మాత్రమే. దీనికి తోడు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. దీంతో అంతా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ లాంటి డిజిటల్ యాప్స్ పై పడ్డారు. అమెజాన్ ప్రైమ్ లో సరిలేరు నీకెవ్వరు ఉంది. సన్ నెక్ట్స్ లో అల వైకుంఠపురములో సినిమా ఉంది. ఈ రెండు సినిమాలకు ఇప్పుడు మరోసారి డిమాండ్ పెరిగింది.

ఇక థియేటర్లు బంద్ అవ్వడంతో, ఆల్రెడీ నడుస్తున్న సినిమాలు కూడా కాస్త తొందరగానే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇందులో భాగంగా 10 రోజుల కిందటే విడుదలైన ఓ పిట్టకథ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లోకి వచ్చేసింది. ఇప్పుడు మరిన్ని సినిమాల్ని ఇలా కాస్త ముందుగానే స్ట్రీమింగ్ కు తెచ్చేలా సంప్రదింపులు షురూ చేసింది అమెజాన్ ప్రైమ్.

ఈనెల 6న విడుదలైన ఈ సినిమాను లెక్కప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో 21 రోజుల తర్వాత పెట్టాలి. అంతేకాదు, ఆ తర్వాత అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ లో కూడా పెట్టాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఇలా విడుదలైన 10 రోజులకే ఇది ఓటీటీలో ప్రత్యక్షమైంది. రీసెంట్ గా రిలీజైన అనుభవించు రాజా, హిట్, రాహు, లోకల్ బాయ్ సినిమాలు కూడా త్వరలోనే ఓటీటీలో ప్రత్యక్షం కాబోతున్నాయి.