సుశాంత్ అలా చెయ్యలేదు: సాంఘీ

Dil Bechara star Sanjana Sanghi about Sushant
Sunday, July 5, 2020 - 22:15

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఓ వెలుగు వెలిగిన రోజుల్లో అతడిపై బురద జల్లేందుకు ఓ సెక్షన్ మీడియా బాగా ప్రయత్నించింది. ఎంతలా అంటే సుశాంత్ కు కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్ని కూడా ఆపాదించింది. పేరు పైకి చెప్పకుండా, సుశాంత్ అని అందరూ గుర్తుపట్టేలా ఇన్ డైరెక్ట్ స్టోరీలు ప్రచారం చేసింది. ఈ విషయాన్ని రీసెంట్ గా కంగనా కూడా బయటపెట్టింది.

అయితే అప్పట్లో సుశాంత్ పై ఓ వర్గం చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఇప్పుడు తేలిపోయింది. సంజనా సాంఘీ అనే అమ్మాయిని సుశాంత్ లైంగికంగా వేధించాడని అప్పట్లో కొన్ని వెబ్ సైట్లు రాసుకొచ్చాయి. వీటిపై తాజాగా సంజనా స్పందించింది. సుశాంత్ తో కలిసి "దిల్ బేచారా" అనే సినిమా చేసిన ఈ హీరోయిన్... సుశాంత్ చాలా మంచోడు అంటోంది.

సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు సంజనా సాంఘిని విచారించారు. ఈ ఎంక్వయిరీలో సుశాంత్ గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది సంజన. సెట్స్ లో ఏ ఒక్క రోజు, ఏ సందర్భంలో తనతో సుశాంత్ అనుచితంగా ప్రవర్తించలేదని సంజనా పోలీసులకు వెల్లడించింది. సుశాంత్ వల్ల తను ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడిన సందర్భం లేదని కుండబద్దలు కొట్టింది.