రంగంలోకి దిగిన దిల్ రాజు

Dil Raju begins discussions
Thursday, January 2, 2020 - 13:15

సంక్రాంతి పండక్కి మహేష్ బాబు, అల్లు అర్జున్ కాలుదువ్వుతున్నారు అని మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. 12న విడుదల కావాల్సిన "ఆల వైకుంఠపురంలో" 10న కానీ లేదా 11న కానీ రిలీజ్ అవొచ్చు అని చర్చ జరుగుతోంది. ఐతే, ఇది టీ కప్పులో తుపానుగానే మిగిలిపోనుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు ఇప్పుడు రంగంలోకి దిగారు. అసలు లేని సమస్యని ఎందుకు క్రియేట్  చేయాల్సి వచ్చిందో కనుక్కున్నారు. దానికి పరిస్కారం కోసం నడుము బిగించారు. 

దిల్ రాజు రంగంలోకి దిగారు కాబట్టి సినిమా విడుదల తేదీల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఇద్దరు హీరోలు ఇగోకి పోతే తప్ప... 9న 'దర్బార్', 11న 'సరిలేరు నీకెవ్వరు', 12న 'ఆల వైకుంఠపురంలో', 15న 'ఎంత మంచివాడవురా' విడుదల అవుతాయి. షెడ్యూల్ మారదు. మారకుండా చూడాలనేదే దిల్ రాజు ప్రయత్నం. 

ఈ శనివారానికి క్లారిటీ వస్తుంది.