నేను ఘోస్ట్‌ని కాదు: దిల్‌రాజు

Dil Raju denies ghost-directing Srinivasa Kalyanam
Monday, August 6, 2018 - 17:45

దిల్ రాజుపై గ‌తంలోనూ చాలా రూమ‌ర్స్ వచ్చాయి కానీ ఈ సారి మాత్రం ఆయ‌న ఎందుకో ఎక్కువ స్పందించాడు. వెంట‌నే వివ‌ర‌ణ ఇచ్చాడు. ఆయ‌న నిర్మించిన తాజా చిత్రం.."శ్రీనివాస క‌ల్యాణం". ఈ సినిమా ఈ నెల 9న విడుద‌ల కానుంది. నితిన్‌, రాశి ఖ‌న్నా జంటగా న‌టించిన ఈ పెళ్లి ఆల్బమ్‌పై చాలా గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు దిల్‌రాజు.

ఐతే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌. గ‌తేడాది "శ‌త‌మానం భ‌వ‌తి" సినిమా తీసిన ద‌ర్శ‌కుడాయ‌న‌. కానీ డైర‌క్ట‌ర్ గురించి ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు. అంతా దిల్‌రాజు గురించే చెపుతున్నారు. దానికి కార‌ణం.. దిల్‌రాజు ఘొస్ట్ డైర‌క్ష‌న్ చేశాడ‌నేది టాక్‌. కానీ నేను ఘోస్ట్‌ని (పేరు వేసుకోకుండా ఒక ప‌ని చేయ‌డం) కాదు అని అంటున్నాడు దిల్‌రాజు.

క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం...అన్నీ స‌తీష్‌వేన‌ట‌. "సినిమా నిర్మాణంలోనే కాదు క‌థాచ‌ర్చ‌ల్లోనూ, ఇత‌ర క్రియేటివ్ ఆస్పెక్ట్ ల‌లో నేను పాలు పంచుకుంటా కానీ వారి ప‌ని అస్స‌లు చేయ‌ను. డైర‌క్ట‌ర్స్‌కి పూర్తిగా స్వేచ్చ ఇచ్చే సంస్థ మాది," అని దిల్‌రాజు వివ‌ర‌ణ ఇచ్చాడు.