దిల్ రాజు సినిమాకైనా పబ్లిసిటీ కావాలి

Dil Raju fails in publicity this time
Sunday, February 9, 2020 - 15:45

దిల్ రాజు సినిమా అంటే రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ గ్యారెంటీ. అతడి ప్రమోషనల్ ప్లానింగ్ అలా ఉంటుంది. దాదాపు నెల రోజుల ముందు నుంచే హోరెత్తిస్తాడు. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫరెంట్ గా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తాడు. ఇంత వ్యూహకర్తగా పేరున్న దిల్ రాజు, జాను విషయంలో మాత్రం తప్పటడుగు వేశాడు.

అవును.. జానుకు సరైన ప్రచారం కల్పించలేకపోయాడు దిల్ రాజు. అందుకే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాలేదు. సినిమాపై కాస్త బజ్ ఉన్నప్పటికీ.. ఆ క్రేజ్ కు ప్రచారాన్ని యాడ్ చేసి, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడంలో ఈసారి రాజు ఫెయిల్ అయ్యాడు. దీనికి ఒక విధంగా సంక్రాంతి సినిమాలు కూడా కారణం.

సంక్రాంతి సినిమాల హవా మొన్నటివరకు నడిచింది. పైగా బరిలో ఉన్న రెండు సినిమాలూ దిల్ రాజువే. అందుకే జాను ప్రచారాన్ని ఆలస్యంగా స్టార్ట్ చేశాడు. దీంతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి దిల్ రాజుకు టైమ్ సరిపోలేదు.

అయితే రిలీజ్ కు ముందు కాలేజ్ టూర్లు, స్టార్స్ ఇంటర్వ్యూలు పక్కనపెడితే.. అంతకంటే ముందు చేయాల్సిన పాటల హంగామా కూడా జానుకు కరువైంది. ఏదో ఒక పాటను ఫ్లాగ్ షిప్ సాంగ్ గా సెలక్ట్ చేసుకొని జనాల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఈ విషయంలో కూడా ప్లానింగ్ తప్పింది. రిలీజ్ ముందురోజు వరకు లిరికల్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఇలా జాను విషయంలో దిల్ రాజు ప్లానింగ్ తప్పింది. ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై కనిపించింది.