ఎవ‌రికీ చెప్పొద్దు అంటున్న‌ దిల్‌రాజు

Dil Raju to release Evariki Cheppoddu
Thursday, July 4, 2019 - 09:15

స్టార్ హీరోల సినిమాలే కాదు.. మంచి క‌థా బ‌ల‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌మిచ్చే నిర్మాత‌ల్లో దిల్‌రాజు ముందుంటారు. హిట్ చిత్రాల నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన దిల్‌రాజు మ‌రో ల‌వ్‌స్టోరీని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. 

క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాకేశ్ వ‌ర్రె, గార్గేయి ఎల్లాప్రగ‌డ హీరో హీరోయిన్లుగా బ‌స‌వ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాకేశ్ వ‌ర్రె నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా పేరు ఎవ‌రికీ చెప్పొద్దు. ఈ చిత్రాన్ని  శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై దిల్‌రాజు విడుద‌ల చేయ‌నున్నారు.ఆగ‌స్ట్‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది.

దిల్‌రాజు విడుద‌ల మాత్ర‌మే చేస్తారు. ప్ర‌మోష‌న్ వ‌గైరా అన్నీ ఒరిజిన‌ల్ నిర్మాతే చూసుకోవాలి.