ఐటీ దాడులు లైట్‌..దిల్ రాజు

Dil Raju responds on IT Raids
Wednesday, May 8, 2019 - 19:30

"మ‌హ‌ర్షి" సినిమా విడుద‌ల‌కి ఒక రోజు ముందు దిల్‌రాజు ఆఫీస్‌పై దాడులు చేశారు ఐటీ అధికారులు. నాలుగు గంట‌ల పాటు ప‌లు అకౌంట్స్ ప‌రిశీలించారు. ఆఫీస్ స్టాప్‌ని ప్ర‌శ్నించారు. ఐతే ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ద్ద‌ని అంటున్నారు నిర్మాత దిల్‌రాజు. పెద్ద సినిమాల విడుద‌ల‌కి ముందు ఐటీ అధికారులు ఆఫీస్‌కి వ‌చ్చి....లెక్క‌ల‌న్నీ స‌వ్యంగా ఉన్నాయా అని ప‌రిశీలించ‌డం కామ‌నే అని అంటున్నారు. 

స‌క్ర‌మంగా వ్యాపారం చేసే త‌మ‌లాంటి ప్రొడ్యుస‌ర్స్ భ‌య‌ప‌డ‌ర‌ని, అధికారులు వారి ప‌ని వారు చేస్తుంటార‌నీ, ఇదంతా రోటీన్‌గా జ‌రిగిదేని చెప్పుకొచ్చారు. మ‌రోవైపు, మ‌హ‌ర్షి టికెట్ రేట్ల పెంపుపై కూడా స్పందించారు. 

"తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌కి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు. మేం రేట్లు పెంచింది తెలంగాణ‌లోనే కాదు ఆంధ్రాలోనూ. ఇపుడున్న ప‌రిస్థితుల్లో భారీ బ‌డ్జెట్ సినిమాల‌కి టికెట్ రేట్లు పెంచ‌క‌త‌ప్ప‌దు. ఎందుకంటే బాహుబ‌లి 2 వంటి బ‌డా సినిమాలు కూడా 50 రోజుల పాటు ర‌న్ తెచ్చుకోలేక‌పోయాయి. త‌క్కువ టైమ్‌లోనే క‌లెక్ష‌న్లు రాబ‌ట్టాలి. ఇలాంటి పెద్ద సినిమాల‌కి పెంచుకునే వెసులుబాటుని హైకోర్టు ఇచ్చింది. ఇది థియేట‌ర్ల ఓన‌ర్లు తెచ్చుకున్న తీర్పు. దీనికి ప్ర‌భుత్వాల‌కి సంబంధం లేదు, " అని వివ‌ర‌ణ ఇచ్చారు దిల్‌రాజు.