థియేటర్ మాఫియాపై స్పందించిన దిల్‌రాజు

తెలుగునాట థియేటర్ల మాఫియా ఉందని నిర్మాత ప్రసన్న చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దిల్‌రాజు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్, సురేష్‌బాబు, ఏషియన్ సినిమాలదే రాజ్యం అని ఆయన బూతులు తిట్టాడు. ఐతే పేటా సినిమాకి థియేటర్లు దక్కడం లేదని ఆయన చేసిన ఆరోపణలు కొంత విచిత్రంగా ఉన్నాయి. తెలుగు సినిమాలన్నీ చాలా కాలం క్రితమే తమ సినిమాల విడుదల తేదీని ప్రకటించాయి. కానీ పేట సినిమా నిర్మాత పది రోజుల క్రితం మూవీ కొని, ఇపుడు థియేటర్లు ఇవ్వడం లేదనడం సబబుగా లేదనేది అభిప్రాయం.
ఇదే విషయాన్ని దిల్‌రాజు ఘాటుగా చెప్పాడు. పేట నిర్మాతల మాటపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.
సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతుంటే అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు దిల్ రాజు. మూడు తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి. అలాంటపుడు డబ్బింగ్ సినిమాలకి ఎలా ఎక్కువ థియేటర్లు ఇస్తామని దిల్‌రాజు అడిగారు.
తెలుగు సినిమాలేవీ ఆడవని పేట మాత్రమే నిలబడుతుందని అశోక్ వల్లభనేని అనడంపై కూడా దిల్‌రాజు ఘాటుగా స్పందించాడు. 18వ తేదీ నుంచి థియేటర్లలో పేటనే ఉంటదని చెబుతున్న అశోక్ ఆరోజే విడుదల చేసుకోవచ్ఛు కదా అని అడిగారు దిల్ రాజు
ఈ ఏడాది పంపిణీదారుడిగా చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. ఐనా సినిమాల మీద ఉన్న ప్రేమతో వ్యాపారం చేస్తున్నా అని చెప్పారు దిల్ రాజు. తెలుగు సినిమాల విడుదల తేదీ ఆరు నెలల ముందే ప్రకటించాం. పేట రిలీజ్ డేట్ 10 రోజుల క్రితం చెప్పారు. మరి ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలని అడిగారు ఆయన.ల
- Log in to post comments