దిల్ రాజు కూడా మారిపోయాడు!

Dil Raju to stay away from new ideas
Thursday, July 19, 2018 - 12:45

ఒక‌పుడు దిల్‌రాజు అంటే చిన్న సినిమాల‌కి కేరాఫ్‌. మంచి క‌థాబ‌ల‌మున్న సినిమాలు తీస్తాడ‌నే పేరు ఉంది. మంచి క‌థ తీసుకొస్తే డైర‌క్ష‌న్ ఛాన్స్ ఇస్తాడ‌నేవారు. ఎంద‌రో కొత్త ద‌ర్శ‌కుల‌కి అండ‌గా నిలిచాడు. సుకుమార్‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బోయ‌పాటి, శ్రీకాంత్ అడ్డాల‌, వంశీ పైడిప‌ల్లి వంటి ద‌ర్శ‌కులంతా దిల్‌రాజు క్యాంప్ నుంచి వ‌చ్చిన‌వారే. ఇపుడు ఆయ‌న ఎక్స్‌పెరిమెంట్స్‌కి జ‌డుసుకుంటున్నాడు. చిన్న సినిమాల‌తో త‌ల‌నొప్పి ఎందుకు అంటున్నాడు.

చిన్న సినిమాలు తీస్తే..ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌డం గ‌గ‌న‌మై పోతోంద‌ట‌. చిన్న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసి...వాటి మీద డ‌బ్బు చూడాలంటే త‌ల‌ప్రాణం తోక‌కి వ‌స్తుంద‌న్న‌ట్లుగా మాట్లాడుతున్నాడు దిల్‌రాజు.  అందుకే నేను లోక‌ల్‌, ఎం.సి.ఎ వంటి నాసిర‌కం క‌థ‌ల‌తో హిట్స్ కొట్టే ప‌నిలో ఉన్నాడు. దిల్‌రాజు కూడా సేఫ్‌గేమ్ ఆడుతున్నాడు.

దిల్‌రాజు పూర్తిగా మారిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక‌పై దిల్‌రాజు బ్యాన‌ర్ నుంచి కొత్త ఆలోచ‌న‌లు, కొత్త త‌ర‌హా సినిమాలు వ‌స్తాయ‌ని భ్ర‌మ‌ప‌డ‌కండి. ఎంత పెడిత ఎంత వ‌స్తుంద‌నే లెక్క‌ల‌తో కూడిన సినిమాల‌కే ఆయ‌న ఫిక్స్ అవుతున్న‌ట్లున్నారు.