కొత్త భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ

Dil Raju takes a selie with Vygha Reddy, his new wife
Wednesday, May 13, 2020 - 11:15

లాక్ డౌన్ టైమ్ లో గుంభనంగా రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు తన పెళ్లి సంగతిని మరుసటి రోజే అధికారికంగా ప్రకటించారు. పెళ్లికి సంబంధించి ఫొటోలు కూడా విడుదల చేశారు. ఇప్పుడు తన రెండో భార్యతో కలిసి దిగిన మొదటి సెల్ఫీని కూడా పోస్ట్ చేశారు.

ఫ్రెష్ గా మరోసారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన దిల్ రాజు, తేజశ్వినితో కలిసి సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఆ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్నటివరకు ఈ జంటను పెళ్లి దుస్తుల్లో మాత్రమే చూసిన నెటిజన్లు, ఇప్పుడు క్యాజువల్ వేర్ లో ఉన్న దిల్ రాజు, తేజశ్వినిని చూసి వావ్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రీసెంట్ గా నిజామాబాద్ లోని నర్సింగ్ పల్లిలో తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి గుడిలో దిల్ రాజు, తేజశ్విని పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత తేజశ్వినిని హైదరాబాద్ లోని తన ఇంటికి తీసుకొచ్చారు దిల్ రాజు. ఆ మరుసటి రోజే ఈ సెల్ఫీ దిగారు. దిల్ రాజు, తేజశ్విని జంట చూడముట్టటగా ఉందంటున్నారు నెటిజన్లు.