దిల్ రాజుకు విషెష్ చెప్పిన కూతురు

Dil Raju's daughter wishes him on his second wedding
Monday, May 11, 2020 - 21:45

"మా నాన్నకు పెళ్లి" సినిమాలో సీన్ లాంటిది ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత, టాలీవుడ్ కింగ్ పిన్స్ లో ఒకరైన దిల్ రాజు, నిన్న రాత్రి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ లోని ఓ ఆలయంలో సింపుల్ గా (లాక్ డౌన్ కావడం వల్ల) జరిగిన ఈ వేడుకలో 29 ఏళ్ల తేజశ్వినిని పెళ్లాడారు దిల్ రాజు. నాన్న మళ్లీ పెళ్లి చేసుకోవడంతో దిల్ రాజు కుమార్తె హన్సితా రెడ్డి, తండ్రికి శుభాకాంక్షలు అందించారు.

జీవితంలో ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తన తండ్రి, తేజశ్విని ఎప్పుడూ సంతోషంగా, ప్రేమగా ఉండాలని హన్సితా రెడ్డి ఆకాంక్షించారు. తన తండ్రి, తేజశ్విని జీవితంలో ప్రతి రోజూ ఓ అద్భుతమైన రోజు అవ్వాలని కోరుకున్నారు.

మరోవైపు తనను ఎల్లప్పుడూ సంరక్షిస్తున్నందుకు, కుటుంబానికి అండగా నిలబడినందుకు తండ్రి దిల్ రాజుకు ధన్యవాదాలు చెప్పారు హన్సితా రెడ్డి. 2017లో దిల్ రాజు తన భార్యను కోల్పోయారు. అప్పట్నుంచి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న రాజును పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు బలవంతం చేశారు. ఫైనల్ గా తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తి కూతురు తేజశ్వినిని దిల్ రాజు పెళ్లాడారు.