పుష్పలో బాలీవుడ్ భామ

Disha Patani to do special song in Pushpa?
Saturday, May 2, 2020 - 13:30

బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వస్తోంది పుష్ప. ఈ సినిమాలో  ఇప్పటికే రష్మికను హీరోయిన్ గా లాక్ చేశారు. మరో కీలక పాత్ర కోసం నివేత థామస్ ను తీసుకున్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదనే విషయం కూడా తేలిపోయింది. ఇప్పుడు" పుష్ప" చుట్టూ మరో హీరోయిన్ పేరు చక్కర్లు కొడుతోంది. ఆమె పేరు దిశా పటానీ.

అవును.. పుష్పలో ఓ ఐటెంసాంగ్ ఉంది. ఆ పాట కోసం మేకర్స్ దిశా పటానీని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి పుష్ప ఐటెంసాంగ్ లో ఓ హీరోయిన్ ను తీసుకోవాలనే ప్లాన్ ఎప్పట్నుంచో సుకుమార్ మైండ్ లో ఉంది. కానీ ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన ఫిక్స్ అవ్వలేదు. అంతలోనే దిశా పేరు తెరపైకొచ్చింది. అయితే .... ఇదంతా మీడియా ప్రచారమే. ఇప్పటివరకు సుకుమార్ టీం ఏమి మాట్లాడలేదు. లాక్డౌన్ ఎప్పుడు పూర్తి అవుతుందో... షూటింగులు ఎప్పుడు షురూ అవుతాయో అన్నదే ఈ టీం పడుతున్న టెన్షన్. అయితే, ఇటీవల "అల వైకుంఠపురంలో" బన్ని వేసిన స్టెప్పుల గురించి దిషా గొప్పగా పొగడడం.... బన్నీ ఆమెకి థాంక్స్ చెప్పడంతో... ఈ ప్రచారం మొదలైంది. ఇదే నిజమైతే... అభిమానులకు పండగే. 

నిజానిది దిశా కెరీర్ స్టార్ట్ అయిందే టాలీవుడ్ లో. పూరి జగన్నాధ్ తీసిన లోఫర్ సినిమాతో ఆమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ జరిగింది. అంతే ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ను వదిలేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలీవుడ్ కు చెక్కేసింది.

ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి టైమ్ లో ఆమె మరోసారి టాలీవుడ్ కు వస్తుందా అనేది డౌట్. ఒకవేళ దిశా ఒప్పుకుంటే, పుష్ప సినిమా ఆమెకు టాలీవుడ్ రీఎంట్రీ మూవీ అవుతుంది.