మళ్ళీ అందాలు ఆరబోసిన బ్యూటీ

Disha Patani shows off her beauty in bikini
Saturday, May 23, 2020 - 11:15

అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనకాడని దిశా పటానీ మరో హాట్ స్టిల్ రిలీజ్ చేసింది. ఆమెకు ఇష్టమైన కాస్ట్యూమ్ ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెటిజన్లు అందరికీ తెలుసు ఆ విషయం. అవును.. మరోసారి బికినీలోకి మారిపోయింది ఈ బ్యూటీ. తన అందమైన ఒంపుల్ని బీచ్ ఒడ్డున అలా పరిచేసింది.

బికినీని, దిశాని విడదీసి చూడలేం. బికినీ తనకు సూట్ అయినంతగా ఎవ్వరికీ సూట్ అవ్వదేమో అంటూ గతంలోనే ప్రకటించిన ఈ పొడుగుకాళ్ల సుందరి.. వీలైనప్పుడల్లా బికినీలోకి జంప్ అయిపోతుందది. ఆ ఫొటోల్ని పోస్ట్ చేస్తుంటుంది.

తాజాగా రిలీజ్ చేసిన ఈ స్టిల్ కూడా ఇప్పడిది కాదు. గతంలో తీసినదే. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైన దిశా పటానీ.. గతంలో బీచ్ ఒడ్డున జరిగిన ఓ ఫొటో షూట్ లోంచి స్టిల్ ను ఇలా రిలీజ్ చేసింది. అసలే వేసవి కాలం.. ఈ స్టిల్ తో వేడిని మరింత పెంచుతోంది దిశా పటానీ. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.