ఆయన నాతో సరసమాడలేదు: దిషా

"లోఫర్" సినిమాలో వరుణ్ తేజ సరసన నటించిన దిషా పటానీ గుర్తుందా? ఆ ఒక్క సినిమాతోనే ఆమెకి సీన్ అర్థమైంది. ఆమె మళ్లీ టాలీవుడ్ ముఖం చూడలేదు. ఐతే నటన రాకపోయినా.. దిషాకి మంచి శరీరాకృతి ఉంది. ఆ ఎస్సెట్‌తో ఆమె బాలీవుడ్‌లో నిలదొక్కుకొంది. ఈ భామ బాలీవుడ్ టైగర్ ష్రాప్‌కి గాల్‌ఫ్రెండ్.
ఇపుడు దిషా వార్తల్లో నిలిచింది. హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతోన్న కొత్త సినిమా నుంచి ఆమె సడెన్‌గా తప్పుకొంది. షూటింగ్ నుంచి వాకౌట్ చేసింది. హృతిక్ ఆమెతో సెట్‌లో ఫ్లర్ట్ (సరసం) చేశాడని, అందుకే ఆమెకి కోపం వచ్చి వాకౌట్ చేసిందని హిందీ పత్రికలు రాశాయి. ఈ ప్రచారంతో హృతిక్ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. అలాంటి పిచ్చి వార్తలు రాస్తే ఊరుకునేది లేదని గట్టిగా ట్వీట్ చేశాడు. తన స్థాయి ఏంటి, తాను అలాంటి పని చేయడం ఏంటని ఫైర్ అయ్యాడు.
దిషా కూడా అదే చెపుతోంది. ఆమె కూడా ట్వీట్ చేసింది. హృతిక్ సార్ నాతో సరసమాడినట్లు పనికిమాలిన పుకార్లు పుట్టించారు. అదంతా అబద్దం అని ఆమె వివరణ ఇచ్చింది. తాను తప్పుకోవడానికి రీజన్ వేరే ఉందట.
- Log in to post comments