కాలేజ్ సెక్స్ సీన్లలో దివ్య రావు

Divya Rao sizzles in College movie
Friday, February 7, 2020 - 19:45

సాధారణంగా అడల్ట్ సినిమాల్ని 2 రకాలుగా ప్రమోట్ చేస్తారు. సినిమాలో మసాలా ఉందని చెబుతారు, వెళ్లిన తర్వాత ఛీట్ చేస్తారు. రెండో రకంలో మాత్రం నిజంగానే మసాలా చూపించి ఉన్నంతలో ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తారు. ఈరోజు రిలీజైన డిగ్రీకాలేజ్ సినిమా రెండో రకం. అవును.. ట్రయిలర్, పోస్టర్లతో ఊరించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. 

డిగ్రీకాలేజ్ సినిమా ట్రయిలర్ రిలీజైనప్పట్నుంచి ఈ సినిమా కంటెంట్ పై కుర్రాళ్లు ఓ కన్నేశారు. ఓవైపు జాను సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ, మరోవైపు డిగ్రీకాలేజ్ చూసేందుకు ఎగబడ్డారు. హీరోయిన్ దివ్యారావు రెచ్చిపోయింది. 

హీరో, హీరోయిన్ల మధ్య ఇంత బోల్డ్ సీన్స్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో చూడలేదని, అడల్ట్ సీన్స్ లో ఇది పీక్స్ అంటున్నారు. మరీ ముఖ్యంగా కాలేజ్ లో సెక్స్ సన్నివేశాలు, బైక్ పై పరుపు తీసుకొని పొలాల్లోకి వెళ్లిన సీన్లు ఓవర్ గా ఉన్నాయట. సందేశాత్మక చిత్రం అనే ముసుగులో అడల్ట్ కంటెంట్ ను చూపించి, బాగానే యూత్ ను ఎట్రాక్ట్ చేసింది. అయితే, డబ్బుల కోసం కాలేజ్ ల్లో రొమాన్స్ చూపించడం ఏంటి అని విమర్శలు కూడా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ తరహా సినిమాల ట్రెండ్ బాగా పెరిగింది. ఈజీ మని మరి.