సావిత్రి త‌ల్లిగా దివ్య‌వాణి

Divya Vani to play Keerthy Suresh's mother
Monday, January 22, 2018 - 18:00

పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్లాల‌ ముద్దుల పొలీసు...ఇలా సుమారు యాభై  సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది ఈ  బాపు బొమ్మ.  స‌హజ నటనతో అలరించిన దివ్యవాణి ప్రస్తుతం నా పేరు మీనాక్షి, పవిత్ర బంధం సీరియల్స్ లో న‌టిస్తున్నారు.

"ఇటీవల మా  అమ్మాయి చదువు కోసమని చెన్నై నుండి  హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇదే  సమయంలో అనుకోకుండా  నాకు ఈ టివి వారి 'నా పేరు మీనాక్షి', స్టార్ మా వారి   'ప్రవిత్ర బంధం' సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ రెండు సీరియల్స్ తో పాటు  వైజయంతి మూవీస్ వారి స‌మహాన‌టిలోనూ న‌టిస్తున్నా. ఇందులో నా పాత్ర సావిత్రిగా నటిస్తున్న కీర్తి సురేష్ తల్లి పాత్ర‌. అంటే సావిత్రి తల్లిగారి పాత్ర‌. పెర్ఫార్మన్స్ స్కోప్ వుండే పాత్రలు వస్తే మ‌రిన్ని తెలుగు చిత్రాల్లో న‌టిస్తా"నంటున్నారు దివ్య వాణి.