క్లాస్ పీకిన అనసూయ

Don't talk rubbish, Anasuya blasts follower
Sunday, May 3, 2020 - 16:15

లాక్ డౌన్ కొత్తలో అనసూయ పెట్టిన ఓ ట్వీట్ బాగా వైరల్ అయింది. ఆమెపై ట్రోలింగ్ ఓ రేంజ్ లో నడిచింది. తనను కూడా పేదవాళ్లతో కలిపేసుకుంటూ అనసూయ అప్పట్లో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ పెట్టిన ట్వీట్ పై అంతా తెగ సెటైర్లు వేశారు. దీంతో అనసూయ చాలా గట్టిగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పట్లో కొందర్ని ఆమె బ్లాక్ చేయాల్సి వచ్చింది కూడా. అక్కడితో ఆ వివాదం సమసిపోయింది.

తాజాగా మరోసారి అనసూయ ఫైర్ అయింది. ఈసారి లైవ్ ఛాట్ లో ఏకంగా ఓ వ్యక్తిపై భగ్గుమంది ఈ బ్యూటీ. లైవ్ ఛాట్ లో అంతా సరదాగా సాగిపోతున్న టైమ్ లో ఓ నెటిజన్ తిక్క ప్రశ్న వేశాడు. ఏదేదో చేయమని ప్రజల్ని కోరే బదులు మీ సెలబ్రిటీస్ అంతా కలిసి ఛారిటీ చేయొచ్చు కదా అన్నాడు. దీనిపై అనసూయ ఫైర్ అయింది. మాక్కూడా కష్టాలుంటాయంటూ రిప్లయ్ ఇచ్చింది.

"మొత్తం జనాభాలో సెలబ్రిటీస్ ఎంత శాతం. వాళ్లు ఎంత చేయగలరు. సెలబ్రిటీస్ అందరికీ ఫ్రీగా డబ్బులొచ్చేస్తాయని అనుకుంటున్నారా. మీలాగే సెలబ్రిటీస్ కూడా కష్టపడుతున్నారు. సెలబ్రిటీస్ కంటే బాగా సంపాదించేవాళ్లు బయట ఉన్నారు. మేం రంగులు పూసుకొని, నవ్వుతూ ఉంటామని మాకు ప్రాబ్లమ్స్ లేవనుకుంటారా. మా సమస్యలు మాకున్నాయి. మీకు చేతనైంది మీరు చేయండి, వాళ్లకు చేతనైంది వాళ్లు చేస్తారు."

ఇలా నెటిజన్ నోరు మూయించింది అనసూయ. తను లాక్ డౌన్ ను ఫాలో అవుతూనే, తన చుట్టుపక్కల నివశిస్తున్న పేదలకు తోచిన సాయం చేస్తున్నానని, అంతా అంతా తమ ఇంటిచుట్టూ ఉన్నవాళ్లకు తోచిన సాయం చేస్తే అది చాలని అంటోంది రంగమ్మత్త.