కీర్తికి డ‌బుల్ ధ‌మాకా

Double Dhamaka for Keerthy Suresh
Tuesday, January 9, 2018 - 14:00

కీర్తి సురేష్‌కి ఈ సంక్రాంతి ప్ర‌త్యేకం. ఇటు తెలుగులోనూ, అటు త‌మిళంలోనూ ఆమె రెండు పెద్ద సినిమాల్లో ఉంది. "అజ్ఞాత‌వాసిలో" ఆమె మెయిన్ హీరోయిన్‌. సంక్రాంతి కానుకగా 10న విడుద‌ల అవుతోంది. ఇప్ప‌టికే బాక్సాఫీస్ వ‌ద్ద ప‌వ‌ర్‌స్టార్ సునామీ మొద‌ల‌యిన‌ట్లు సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇది ఆమె కెరియ‌ర్‌లోనే వెరీ బిగ్ మూవీ.

ఇక సంక్రాంతి కానుక‌గా ఆమె త‌మిళంలో న‌టించిన సూర్య సినిమా విడుద‌ల అవుతోంది. ఈ సినిమా తెలుగులోనూ "గ్యాంగ్‌" పేరుతో డ‌బ్ అయి విడ‌ద‌ల అవుతోంది. అంటే పొంగ‌ల్ పోటీలో ఈ అమ్మ‌డి సినిమాలు రెండు ఉన్నాయి.

సూర్య సినిమా త‌మిళ‌నాట వెరీ బిగ్ మూవీ. రెండూ పెద్ద హిట్ అయితే కీర్తి సురేష్ గ్రాఫ్ మొత్తంగా మారిపోతుంది.