డబుల్ ధిమాక్ డబుల్ రేట్

Double Dhimaak Double Rate
Thursday, August 1, 2019 - 22:30

రామ్ ని సినిమా ఇండస్ట్రీలో బాలబాబు అంటారు. అంటే చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చినా... తెలివితేటల్లో మాత్రం యమా ముదురు అని అర్థం. ఇది కాంప్లిమెంటా, విమర్శా అన్నది చూసేవారి కోణాన్ని బట్టి ఉంటుంది. ఒకటి మాత్రం నిజం.. చిన్న ఏజ్ లోనే మంచి విజయాలు, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఈ పోతినేని పోరడు.

రామ్ అన్ని విషయాల్లోనూ ఇస్మార్ట్ అని మరోసారి పూర్తి అయింది. పూరి జగన్నాథ్ వచ్చి మొదటి సారి కథ చెప్పినపుడు నో చెప్పాడు. ఇలాంటి సాదాసీదా కథలు వద్దన్నాడు. హేయ్ పూరి... నాకు బాడ్ బోయ్ ఇయ్యి (ఇస్మార్ట్ శంకర్ లో రామ్ మోడులాషన్ లో చదువుకొండి) అని చెప్పాడు. దాంతో పూరి మళ్లీ హీరో క్యారక్టరైజేషన్ ని మార్చి డబుల్ ధిమాక్ ఇస్మార్ట్ శంకర్ గా మార్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఇప్పటికే 30 కోట్ల మార్క్ దాటేసింది. ఇంకా కలెక్షన్ వస్తూనే ఉంది. 40 కోట్ల మార్క్ ని టచ్ అవుతుందా అనేది చూడాలి. 

ఇక్కడే అసలు తిరకాసు ఉంది.

రిలీజ్ కి ముందు రామ్ తన పారితోషికంలో కొంత రిబేట్ ఇచ్చాడు పూరికి. అంటే రిలీజ్ అయి.. సినిమా సూపర్ హిట్టయితే అపుడు నాకు ఫుల్ రెమ్యునరేషన్ ఇద్దురులెండి...ఇపుడు దీంతో సరిపెట్టుకుంటా అని పూరికి మాటిచ్చాడు. ఎందుకంటే పూరి అప్పటికున్న ఫామ్ ని చూసి...సినిమా పాస్ అయిపోతే చాలు అనుకున్నాడు. కానీ సుడి బాగుంది.. డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. మరి అంత లాభం వచ్చిన తర్వాత కొంతే ఇస్తానంటే ఎట్లా భయ్యా? అందుకే డబుల్ హిట్ అయింది కాబట్టి రిబేట్ ఇచ్చిన ఎమౌంట్ కి డబుల్ డబ్బులు ఇమ్మంటున్నాడు. మొదట బెట్టు చేసిన పూరి ఆ తర్వాత మెట్టు దిగి ఒప్పుకున్నాడట. అలా ఒప్పుకున్నాకే...రామ్ స్పెయిన్ ట్రిప్పుని షార్ట్ చేసుకొని.. హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. అదీ మేటర్.