తెలుగు పిల్లకు బంపరాఫర్

Eesha Rebba gets Bollywood offer
Monday, January 20, 2020 - 19:45

తెలుగమ్మాయిని కాబట్టే తనకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేసింది. తను చాలా హాట్ గా ఉంటానని, మేకర్స్ మాత్రం తనకు హోమ్లీ పాత్రలే ఇస్తున్నారని హాట్ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చింది. ఇలా తెలుగులో కొనసాగుతున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బాకు ఇప్పుడు బంపరాఫర్ తగిలింది. ఏకంగా బాలీవుడ్ ఆఫర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

అనీల్ కపూర్ కొడుకు, సోనమ్ కపూర్ తమ్ముడు హర్షవర్థన్ కపూర్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా ఈషా రెబ్బాను తీసుకుంటున్నారట. ఆడిషన్ తర్వాత ఈషాను దాదాపుగా సెలక్ట్ చేశారు. కాకపోతే ఇంకా అగ్రిమెంట్ జరగలేదు. అందుకే ఈషా ఎక్కడా స్టేట్ మెంట్ ఇవ్వలేదు. మీడియాకు మాత్రం లీకులిచ్చింది.

జాతీయ అవార్డు గ్రహీత రాజ్ సింగ్ చౌదరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఈషాకు చాలా మంచి పాత్ర దొరికిందట. సగటు బాలీవుడ్ హీరోయిన్ లా పాటల్లో స్టెప్పులు వేయడం, లిప్ కిస్సులు పెట్టడం, స్కిన్ షో చేయడం లాంటివి కాకుండా.. యాక్టింగ్ కు స్కోప్ ఉండే క్యారెక్టర్ దొరికిందట. త్వరలోనే తన బాలీవుడ్ ఆఫర్ పై స్పందించబోతోంది ఈ బ్యూటీ.

ఓ వైపు తెలుగులో అవకాశాలు రావడం లేదని బాధపడుతున్న ఈషాకు ఇది చాలా పెద్ద ఆఫర్. కనీసం ఈ ఆఫర్ తర్వాతైనా ఈషాను టాలీవుడ్ మేకర్స్ పట్టించుకుంటారేమో చూడాలి.