ఖేల్ ఖ‌తం దుకాన్ బంద్ అంటున్న రాజ‌మౌళి

End of Baahubali series, Rajamouli gives clarity
Friday, May 5, 2017 - 19:15

బాహుబ‌లి 2 సినిమా మొద‌టి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి ఎంట‌రైంది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ కూడా పూర్త‌యింది. బాహుబ‌లి సిరీస్‌కి సంబంధించినంత వ‌ర‌కు ఖేల్ ఖ‌తం దుకాణ్ బంద్ అంటున్నాడు రాజ‌మౌళి. ‘బాహుబలి’తో తన ప్రయాణం పూర్తైందని రాజమౌళి లండ‌న్ నుంచి ట్వీటేశాడు. హీరోయిన్ అనుష్క‌, కీర‌వాణి, నిర్మాత శోభుల‌తో క‌లిసి లండ‌న్‌లో సినిమాని ప్ర‌మోట్ చేశాడు.

బ్రిటిష్ ఫిల్మ్ సంస్థ కార్యాల‌యంలో స్టూడెంట్స్‌తో మాట్లాడాడు. అలాగే ఇత‌ర ప్ర‌మోష‌న్  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇక బాహుబలి సినిమా సిరీస్‌ పూర్తైపోయినట్టేనని ట్విటర్‌లో రాసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అనుష్క‌, శోభుతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. 

బాహుబ‌లి 3 ఉండ‌దు...
మ‌రోవైపు బాహుబ‌లి 2 సినిమాకి కొన‌సాగింపుగా బాహుబ‌లి 3 ఉంటుంద‌ని మూడు రోజులుగా ప్ర‌చారం ఊపందుకొంది. అయితే అలాంటిదేమీ లేద‌ని క్లారిటీ ఇచ్చాడు రాజ‌మౌళి. మంచి క‌థ ఉంటే బాహుబ‌లి సిరీస్‌ని పొడిగిస్తే త‌ప్పు లేద‌ని రాజ‌మౌళి చేసిన కామెంట్‌ని ప‌ట్టుకొని బాహుబ‌లి 2 గురించి ఊహాగానాలు అల్లేశారంతా.