గోదావరి నదిలో కళ్యాణ్ రామ్ ఫైట్

Entha Manchivaadavura completes shooting part
Tuesday, November 26, 2019 - 18:45

నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా రూపొందుతోన్న 'ఎంత మంచివాడవురా' షూటింగ్ పూర్తి చేసుకోండి. ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'శతమానం భవతి' ఫేమ్ సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని పాటలను డిసెంబరులో విడుదల చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

గోపీసుందర్ స్వరకల్పన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాట, రామజోగయ్య  శాస్ర్తి రెండు పాటలు, శ్రీమణి ఒక పాట రాశారు. ఇందులో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయని దర్శకుడు సతీష్ వేగేశ్న తెలిపారు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ను ఖర్చుకు వెనుకాడకుండా చాలా రిచ్ గా తీశామని, గోదావరి నదిలో సాహోసోపేతంగా చిత్రీకరించిన ఈ సన్నివేశాల విషయంలో ఫైట్ మాస్టర్ వెంకట్ రిస్క్ తీసుకున్నారట. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.