సిద్ధార్థ, జీవీ ప్రకాష్‌.... ‘ఎరుపు పసుపు పచ్చ’

Erra Pasupu Pachcha combo
Monday, August 5, 2019 - 12:00

కథలో ఏదో కొత్తదనం ఉంటేగానీ, ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మితేగానీ సినిమాలకు సంతకం చేయరు హీరో సిద్ధార్థ, మ్యూజిక్‌ డైరక్టర్‌ కమ్‌ హీరో జీవీ ప్రకాష్‌. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే, ఆ కథ ఎంత స్పెషల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ తాజా చిత్రం పేరు ‘ఎరుపు పసుపు పచ్చ’. తమిళంలో ‘సివప్పు మంజల్‌ పచ్చై’ పేరుతో రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది శశి. ఆయన పేరు చెప్పడంకన్నా ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి అంటే వెంటనే అందరికీ గుర్తుకొస్తారు. ‘బిచ్చగాడు’ తర్వాత స్ర్కిప్ట్‌ మీద బాగా వర్క్‌ చేసి ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది. 

తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన రమేష్‌ పిళ్లై ‘ఎరుపు పసుపు పచ్చ’ను నిర్మిస్తున్నారు. 

'ఎరుపు పసుపు పచ్చ’ తాజా విశేషాలను నిర్మాత రమేష్‌ పిళ్లై వెల్లడిస్తూ... ‘‘ఒక ట్రాఫిక్‌ ఇనస్పెక్టర్‌కీ, ఒక బైక్‌ రేసర్‌కీ మధ్య సాగే ఎమోషనల్‌ వార్‌ చిత్రమిది. అని అన్నారు రమేష్‌ పిళ్లై. దర్శకుడు ‘బిచ్చగాడు’ ఫేమ్‌ శశి మాట్లాడుతూ ‘ వచ్చేనెల ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మంచి భావోద్వేగాలున్న సబ్జెక్ట్‌ ఇది. అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు.