ఇప్పటికైనా ఇషాని ఆలా చూడొద్దు!

Esha Rebba doesn't want to be girl next door
Tuesday, December 10, 2019 - 10:45

తెలుగు హీరోయిన్లు అన్ని పాత్రలకు సరిపోరు. మరీ ముఖ్యంగా గ్లామరస్ పాత్రలకు వాళ్ల ఫిజిక్స్ సూటవ్వవు. చాలామంది నిర్మాతలు, దర్శకుల నిశ్చితాభిప్రాయం ఇది. అయితే అందరి విషయంలో ఇది నిజం కాదని ప్రూవ్ చేస్తోంది ఈషా రెబ్బ. తన లేటెస్ట్ స్టిల్స్, హాట్ పోజులతో తెలుగమ్మాయి అనే రిమార్క్ ను మరిపిస్తోంది.

దాదాపు నెల రోజులుగా ఇదే పనిలో ఉంది ఇషా రెబ్బ. రోజుకో హాట్ ఫొటోతో దుమ్ముదులుపుతోంది. తాజాగా ఈమె నుంచి వచ్చిన మరో నాలుగు ఫొటోలు రసిక హృదయాల్ని కొల్లగొడుతున్నాయి. చిన్న నిక్కరు వేసుకొని, కైపెక్కించే చూపులతో ఇషా వదిలిన ఆ స్టిల్స్ చూస్తే ఎవరికైనా మతిపోతుంది. తెలుగమ్మాయిలో కూడా గ్లామర్ లుక్స్ ఉన్నాయనిపిస్తుంది.

తను అందంగా ఉంటానని, అల్ట్రా గ్లామరస్ గా కనిపించడానికి రెడీ అని ఓపెన్ గా ప్రకటించింది ఇషా రెబ్బ. కానీ ఇప్పటివరకు ఆమె ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. చివరికి రీసెంట్ గా వచ్చిన రాగల 24 గంటల్లో అనే సినిమాలో కూడా ఆమె హాట్ గా కనిపించింది. అది కూడా ఆమెకు కలిసిరాలేదు. దీంతో ఇలా రోజుకో హాట్ స్టిల్ రిలీజ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా మన తెలుగు అమ్మాయే కదా అని తక్కువగా చూడొద్దు. ఆమెలోని 
గ్లామర్ కోణాన్ని వాడండి అని చెప్తున్నాయి ఆమె ఫోటోషూట్ స్టిల్స్.