తెలుగు అమ్మాయిని కాబట్టే ఆలా ఇరికించారు

Esha Rebba talks about her new makover
Tuesday, November 19, 2019 - 13:30

తనను తాను హాట్ బ్యూటీగా చెప్పుకుంటోంది ఈషా రెబ్బా. ఎప్పుడూ తను హాట్ గానే ఉంటానని, కాకపోతే తనలో హాట్ నెస్ ను ఎవ్వరూ పెద్దగా గుర్తించలేదని బాధపడుతోంది. రాగల 24 గంటల్లో అనే సినిమాలో నటించిన ఈషా.. ఆ మూవీ ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా తనలోని హాట్ నెస్ ను బయటపెట్టింది.

"రాగల 24 గంటల్లో సినిమాలో నేను చాలా హాట్ గా ఉన్నానని అంటున్నారంతా. చాలా థ్యాంక్స్. నేను హాట్ అని చాన్నాళ్ల తర్వాత గుర్తించారు. అది మంచిదే కదా. నిజానికి నేనెప్పుడూ అందంగానే ఉంటాను. కానీ చాలామంది దాన్ని గుర్తించరంతే."

కేవలం తను తెలుగమ్మాయిని కావడం వల్లనే తనను మూస పాత్రల్లో ఇరికించేశారని అంటోంది ఈషా. ఈ విషయంలో తను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అవకాశాలు కూడా తగ్గిపోయాయని బాధపడింది. ఇనస్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల వల్ల తనలో కూడా హాట్ నెస్ ఉందనే విషయాన్ని చాలామంది తెలుసుకున్నారని అంటోంది.

"తెలుగు అమ్మాయి అనేసరికి చాలామంది చుడీదార్లు, చీరలు అంటూ నన్ను స్టీరియోటైపు చేసేశారు. అందువల్ల మిగతా దుస్తుల్లో నేను పెద్దగా కనిపించలేకపోయాను. ఇనస్టాగ్రామ్ వల్ల నేను కూడా హాట్ గా ఉంటానని గుర్తించారు. రకరకాల దుస్తులు వేసుకుంటున్నాను. కానీ సినిమాలకు వచ్చేసరికి విలేజ్ బ్యాక్ డ్రాప్, ట్రెడిషనల్ పాత్రల కోసం మాత్రమే నన్ను తీసుకుంటున్నారు."

రాగల 24 గంటల్లో సినిమాలో మాత్రం తనను కొత్తగా చూస్తారని అంటోంది ఈషా. ఈ సినిమాలో అందంగా కనిపిస్తూనే, కొన్ని చోట్ల చాలా హాట్ గా, సెక్సీగా కూడా కనిపిస్తానని చెబుతోంది. ట్రయిలర్ చూస్తుంటే.. సినిమాలో ఈషా రెబ్బా బెడ్ రూమ్ సీన్స్ చాలానే ఉన్నట్టు అనిపిస్తోంది.