కథ మార్చింది ఎవరు?

Evaru story has been changed
Monday, August 5, 2019 - 18:00

"ఎవరు" సినిమా ట్రయిలర్ అదిరింది. ఇది హాలీవుడ్ మూవీనా? తెలుగు సినిమానా అన్నట్లుగా ఉందని నాని ఊరికే అనలేదు మరి. తెలుగు సినిమా ప్రేక్షకులకి హాలీవుడు తరహా కథ, కథనాలతో కూడిన థ్రిల్లర్స్  అందిస్తున్నాడని అడివి శేషు ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. చదువుకున్న ప్రేక్షకులలో తనకంటూ ఒక ఇమేజుని బిల్డప్ చేసుకోవడంలో పుల్లుగా సక్సెసయ్యాడు.

ఈ తాజా ట్రయిలర్ ని చూస్తే ఆ మధ్య వచ్చిన స్పానిష్ సినిమాకి రీమేక్ అనిపిస్తోంది. రీమేక్ హక్కులను కొని కథని మార్చుకున్నారని తెలుస్తోంది. ఉన్నదున్నట్లు తీస్తే... ఆ స్పానిష్ సినిమా చూసిన తెలుగు నెట్ ప్లిక్స్  ప్రేక్షకులు పెదవి విరుస్తారేమోనని తనదైన శైలిలో మరిన్ని ట్విస్టులు జోడించాడట శేషు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు వెంకట్ రాoజీ  పరిచయం అవుతున్నాడు. ఐతే డైరక్టర్ ఎవరైనా.. స్క్రీన్ ప్లే , ఘోస్ట్ డైరక్షన్ అంతా శేషుదే అనడంలో ఎక్కువ థింకాల్సిన అవసరం లేదు.

శేషు.. ఇలాంటి జోనర్స్ లో ఎక్స్ పర్ట్. మరి ఆయన ఎలాంటి ట్విస్టులు జోడించాడో, ఎంతవరకు కథమార్చాడో తెలియాలంటే పంద్రాగస్టు వరకు ఆగాలి.