ఒక్క నైట్ కి సీన్ మారింది!

Evlyn Sharma talks about nepoitism
Tuesday, July 21, 2020 - 14:00

సుశాంత్ సింగ్ మరణం నుంచి నెపొటిజం టాపిక్ ఊపందుకుంది. తాజాగా హీరోయిన్ ఎవ్లీన్ శర్మ కూడా తన అనుభవాలను చెప్తోంది. రాత్రికి రాత్రి తనను సినిమాల్లోంచి పీకేసిన ఘటనలు ఉన్నాయని చెబుతోంది.

"నెపొటిజం ఉంది. అలాంటి ఎన్నో ఘటనలు నన్ను స్ట్రాంగ్ గా మార్చాయి. నటించడానికి అవకాశం లేని ఎన్నో పాత్రలు గతంలో నాకు వచ్చాయి. అయినా కూడా వాటి నుంచి రాత్రికి రాత్రి నన్ను తొలిగించారు. ఈవెనింగ్ కాల్ షీట్స్ అడిగి... నైట్ పోయి డే రాగానే నేను ఆ సినిమాలో లేను. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒకరు రాత్రికి రాత్రి నన్ను తొలిగించారు."

కెరీర్ ప్రారంభంలో నెపొటిజంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతున్న ఎవ్లీన్.. పదేళ్ల కెరీర్ లో చాలా తక్కువ సినిమాల్లో తను నటించడానికి కారణమేంటో ఈజీగానే గెస్ చేయొచ్చని చెబుతోంది. అధికారం, డబ్బు మాత్రమే బాలీవుడ్ లో పనిచేస్తాయని.. మెల్లగా అన్నింటికి అలవాటు పడి తను మానసికంగా స్ట్రాంగ్ గా మారానని చెబుతోంది.