ఆ షూటింగ్ స్పాట్ చాలా డేంజర్

EVP Film city, a very dangerous shooting spot?
Thursday, February 20, 2020 - 17:45

ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమా షూటింగ్ లో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో దర్శకుడు శంకర్, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఐతే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఇద్దరు సెట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందడంతో తమిళ సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాంతో పాటు.. ఆ షూటింగ్ స్పాట్ గురించి విమర్శలు కూడా మొదలు అయ్యాయి. 

చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీ అనే ప్రాంతంలో షూటింగ్ జరిగింది. ఇక్కడ ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగడం ఇదే మొదటి సారి కాదు. 

రజినీకాంత్ నటించిన 'కాలా', కమల్ హాసన్ నిర్వహించిన 'బిగ్ బాస్ 2' , విజయ్ నటించిన 'బిగిల్' షూటింగ్ సందర్భంలోనూ ప్రమాదాలు సంభవించాయి. ఈ మూడు షూటింగ్ లలోనూ కార్మికులు చనిపోయారు. ఈ ప్లేస్ లో ఎదో ఉంది. ఇక్కడ షూటింగులు చేయొద్దు అనే డిమాండ్ మొదలైంది ఇప్పుడు.