అక్టోబ‌ర్ 8న ఎవ్వ‌రికీ చెప్పొద్దు

Evvariki Cheppoddu to release on October 8
Thursday, October 3, 2019 - 15:00

ఒక‌బ్బాయి, అమ్మాయి.. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌. అబ్బాయిని ఇష్ట‌ప‌డ్డ అమ్మాయి.. త‌న ప్రేమ‌ను మాత్రం అత‌నికి చెప్ప‌దు. అబ్బాయి ఫోన్ చేసినా తిడుతుంది.. చేయ‌క‌పోయినా తిడుతుంది. అయితే ప్రేమిస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య ఉండే అంత‌రం కులం.. మ‌రి ఈ అంతరాన్ని దాటి ఇద్ద‌రు ప్రేమికులు ఒక‌ట‌య్యారా?  లేదా? అనేది తెలుసుకోవాలంటే `ఎవ్వ‌రికీ చెప్పొద్దు` సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్ స‌భ్యులు.

క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాకేశ్ వ‌ర్రె, గార్గేయి ఎల్లాప్రగ‌డ హీరో హీరోయిన్లుగా బ‌స‌వ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాకేశ్ వ‌ర్రె నిర్మాణంలో రూపొందిన ల‌వ్‌స్టోరీ `ఎవ్వ‌రికీ చెప్పొద్దు`.  గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ డిఫ‌రెంట్‌గా ఉందంటూ అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని  శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు.