తెనాలిలో ఎఫ్2 బ్యాచ్

F2 kind of comedy in Tenali Ramakrishna
Tuesday, November 12, 2019 - 08:00

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది తెనాలి రామకృష్ణ సినిమా. సందీప్ కిషన్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతా కామెడీ బాగుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించాడని టాక్.

ఉన్న కథకు ఫుల్ గా కామెడీ టచప్ ఇచ్చాడు దర్శకుడు. ఈ విషయంలో అతడు ఎఫ్2 సినిమాను గట్టిగా ఫాలో అయినట్టు ఇంటర్నల్ టాక్. ఎఫ్2 సినిమాలో ఉన్న కామెడీ బ్యాచ్ మొత్తం "తెనాలి"లో కూడా ఉంది. అంతేకాదు, కామెడీ కూడా దాదాపు ఎఫ్2, రాజా ది గ్రేట్ సినిమాల తరహాలోనే ఉంటుందని టాక్. ఈ రెండు సినిమాలు అనీల్ రావిపూడి తీసినవే. 

అయితే సెన్సార్ టాక్ మాత్రం దీనికి కాస్త భిన్నంగా ఉంది. సినిమాలో కామెడీ కంటే సెకండాఫ్ లో హీరో చూపించిన తెలివితేటలు, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయంటున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో స్కూటర్లతో నడిచే ఎపిసోడ్ టోటల్ సినిమాకే హైలెట్ అంటున్నారు