ఫ్యామిలీ ప్యాక్ పోస్టర్ రిలీజ్

Fammily pack motion poster released
Tuesday, June 16, 2020 - 23:00

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే తన ఐదో సినిమాగా ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లిఖిత్ శెట్టి,అమృత అయ్యంగార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. 

‘‘ఫ్యామిలీ ప్యాక్’’ మూవీ మోషన్ పోస్టర్ ని చూసి అక్కడ కనిపిస్తున్న జంట రిలేషన్ ఎంటో గెస్ చేసి ట్విట్టర్ లో కామెంట్ చేసిన 5 మందికి జె.బి.ఎల్ స్పీకర్లను అందజేస్తుంది మూవీ టీం. దీని కోసం ట్విట్టర్ లో #FamilyPack అని టైప్ చేసి సెర్చ్ చేసి కామెంట్ చేయవచ్చు.

ఈ మూవీని ఎస్.అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది.