ఏంటిది భాస్కరరావు.. పూజా చిరు కోపం

A fan goes all the way to Mumbai to meet Pooja Hegde
Thursday, January 16, 2020 - 15:45

హీరోయిన్ పూజా హెగ్డేకు కోపం వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న భాస్కర్ రావును మందలించింది. అంతా బాగానే ఉంది కానీ ఈ భాస్కర్ రావు ఎవరు? అక్కడికే వస్తున్నాం. భాస్కర్ రావు అనే వ్యక్తి పూజా హెగ్డేకు ఫ్యాన్. కాదు.. కాదు.. డైహార్డ్ ఫ్యాన్. పూజా హెగ్డే స్వయంగా అతడ్ని తన ఫ్యాన్ గ్రూప్ కు పరిచయం చేసింది.

పూజా హెగ్డేను కలిసేందుకు చాలా కష్టపడి ముంబయి వచ్చాడు ఈ భాస్కరరావు. 5 రోజుల పాటు ఆమె కోసం పడిగాపులు కాశారు. ఈ 5 రోజులు ముంబయి వీధుల్లోనే గడిపాడు, రోడ్లపైనే పడుకున్నాడు. ఎట్టకేలకు పూజా హెగ్డేను కలిశాడు. తన కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు. అయితే పూజా హెగ్డేకు మాత్రం కోపం వచ్చింది.

తన కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదంటోంది పూజా హెగ్డే. అభిమానులు ఎక్కడున్నా, వాళ్ల ప్రేమను తను ఫీల్ అవుతానని, దయచేసి ఇకపై ఇలాంటి పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తోంది. అలా ఈ భాస్కర్ రావు 2 రోజులుగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాడు. తనతో పాటు తెచ్చుకున్న చాక్లెట్ బాక్స్ ను పూజా హెగ్డేకు ఇచ్చి ఆమెతో షేక్ హ్యాండ్ పుచ్చుకొని వెళ్లిపోయాడు.

ఈ మొత్తం వ్యవహారాన్ని పూజా హెగ్డే వీడియో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇలా పూజా హెగ్డే వీడియో తీసి పెడుతుందేమో అనే ఆశతో చాలామంది ఇప్పుడామె కోసం పడిగాపులు పడతారేమో