హీరోయిన్ కు ముద్దు పెట్టిన అభిమాని

A fan plans a kiss on heroine
Friday, January 10, 2020 - 17:15

హీరోయిన్ కనిపిస్తే సెల్ఫీ దిగాలనుకుంటారు. మరికొందరు ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటారు. ఓ ఆకతాయి మాత్రం ఏకంగా ముద్దు పెట్టి పారిపోయాడు. దీంతో సదరు హీరోయిన్ షాక్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ బ్యూటీ అనిపించుకుంటున్న సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కు ఈ వింత అనుభవం ఎదురైంది. మేటర్ లోకి వెళ్దాం..

ముంబయిలో అప్పుడే జిమ్ నుంచి బయటకొచ్చింది సారా. ఆమె కోసం కొంతమంది బయట ఎదురుచూస్తున్నారు. కనిపిస్తే హాయ్ చెబుతామనుకున్నారు. సారా కూడా వాళ్లకు హాయ్ చెప్పేసింది. పోనీలే అనుకుందేమో, కారు ఎక్కబోతూ సెల్ఫీలకు కూడా సై అంది. దీంతో కొంతమంది ఆమె దగ్గరకొచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. మరికొందరు షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ ఆకతాయి సారాకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఆమె చేతిపై ముద్దుపెట్టాడు.

ఊహించని విధంగా ఎదురైన ఘటనకు సారా కాస్త షాక్ అయింది. వెంటనే వ్యక్తిగత సిబ్బంది కలుగజేసుకొని ఆకతాయిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అతడు అప్పటికే పరుగులంకించుకున్నాడు. పాపం, సారాకు కొత్త కదా, అందుకే ఇలా అందర్నీ దగ్గరకు రానిచ్చింది. ఇక మీదట పిల్ల మరింత జాగ్రత్తపడుతుంది.