బోర్ కొడుతోంది: నభా నటేష్

Feeling bored at home, says Nabha Natesh
Friday, May 29, 2020 - 20:45

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో బోర్ కొడుతోందని చెబుతోంది నభా నటేష్. చాలా ఫ్రీ అయిపోయానని.. టీవీ చూస్తూ, పెయింటింగ్స్ వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నానని చెబుతోంది.

"అస్సలు బిజీగా లేను. ఫుల్ ఛిల్. టీవీ చూస్తున్నాను. పుస్తకాలు చదువుతున్నాను. నచ్చిన వంట చేసుకుంటున్నాను. కాకపోతే అందాన్ని మాత్రం కాపాడుకోవాలి కదా. అందుకే ఇంటిలో కొన్ని బ్యూటీ టిప్స్ పాటిస్తున్నాను."

సెట్స్ పైకొచ్చేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది నభా నటేష్. ఈ బోర్ పోవాలంటే అర్జెంట్ గా సెట్స్ పైకి వెళ్లిపోవాల్సిందేనంటోంది. అందుకే సోలో బ్రతుకే సో బెటర్ యూనిట్ కు ఎప్పటికప్పుడు వాట్సాప్ మెసేజీలు పెడుతుంటుందట. షూటింగ్ కు వచ్చేస్తానని చెబుతుందట.

Nabha Natesh

"సెట్స్ ను బాగా మిస్ అవుతున్నాను. ఎప్పుడెప్పుడు షూటింగ్ కు వద్దామా అని ఉంది. ఇదే విషయాన్ని మా యూనిట్ వాట్సాప్ గ్రూప్ లో పెడుతుంటాను. వీలైనంత తొందరగా షూటింగ్స్ మొదలుకావాలని కోరుకుంటున్నాను."

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సాయితేజ్ సరసన "సోలో బ్రతుకే సో బెటర్" సినిమా చేస్తోంది. లెక్కప్రకారం ఈ సినిమా ఈనెల 1న విడుదలవ్వాలి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయి, విడుదల వాయిదా పడింది. ఓ 10 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.