ఫైటర్‌గా మారుతున్న విజయ్‌ దేవరకొండ

Fighter title registered for Vijay Deverakonda?
Thursday, August 22, 2019 - 13:00

విజయ్‌ దేవరకొండ - పూరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకి టైటిల్‌ దాదాపు కన్‌ఫమ్‌ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా ఫిల్మ్‌ చాంబర్‌లో "ఫైటర్‌" అనే టైటిల్‌ రిజిష్టర్‌ అయింది. చార్మి ఈ టైటిల్‌ని రిజిష్టర్‌ చేసినట్లు సమచారం. ఆ టైటిల్‌ విజయ్‌కే సూట్‌ అవుతుందని. ఇది పక్కా కమర్షియల్‌ సినిమా.

విజయ్‌ దేవరకొండ ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని, తన బాడీ లుక్‌ని మార్చుకోనున్నాడు. సిక్స్‌ప్యాక్‌కి కూడా వెళ్తాడనేది టాక్‌. విజయ్‌ దేవరకొండ... డియర్‌ కామ్రేడ్‌ తర్వాత కొంత వర్రీ అవడం మొదలుపెట్టాడు. ఆ సినిమా అపజయం కన్నా.. ఇండస్ట్రీలోని కొన్ని శక్తులు బాగా నెగిటివ్‌ ప్రచారం చేయడంపై అలర్ట్‌ అయ్యాడు. అందుకే పూరి డైరక్షన్‌లో మాస్‌ సినిమా చేసి... తన మార్కెట్‌ని మరింతగా స్ట్రెంత్‌ చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు.

"ఫైటర్‌" అనే ఈ టైటిల్‌ని ఫైనల్‌గా ఫిక్స్‌ చేస్తారా లేదా అన్నది చూడాలి. మరోవైపు, ఈ సినిమా కోసం పూరి జాన్వీని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. జనవరి నుంచి ఈ సినిమా మొదలవుతుంది.