పెళ్లికి రెడీ అవుతున్న మరో హీరోయిన్

Freida Pinto to marry boyfriend
Wednesday, November 28, 2018 - 09:15

బాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. రీసెంట్ గా దీపిక-రణ్వీర్ పెళ్లి చేసుకున్నారు. మరో 4 రోజుల్లో ప్రియాంక-నిక్ కూడా పెళ్లితో ఒకటి కాబోతున్నారు. కమెడియన్ కపిల్ శర్మ కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ ఫ్రిదా పింటో కూడా చేరింది. ప్రియుడు కోరి ట్రాన్ తో కొన్నాళ్లుగా పీకల్లోతు డేటింగ్ లో మునిగిపోయిన ఫ్రిదా, త్వరలోనే అతడ్ని పెళ్లాడనుంది.

ఈ మేరకు హాలీవుడ్ మీడియా, మరికొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాయి.

వచ్చే ఏడాది ప్రథమార్థంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారనేది ఆ కథనాల సారాంశం. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది ఫ్రిదా పింటో. ఆ క్రేజ్ తో ఆమె పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించింది. అదే సమయంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అడ్వెంచర్ ఫొటోగ్రాఫర్ కోరి ఈమెకు పరిచయమయ్యాడు. అప్పట్నుంచి వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. రీసెంట్ గా ఫ్రిదాకు కోరి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. దానికి ఫ్రిదా కూడా ఒప్పుకుంది.

లండన్ లో సింపుల్ గా పెళ్లి తంతు ముగించాలని వీళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ముంబయిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేయబోతున్నారు. తన పెళ్లి విషయాన్ని మరో 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతోంది ఫ్రిదా.