చిరంజీవి, మోహన్ బాబు కొంటె ట్వీట్లు

Fun tweets between Chiranjeevi and Mohan Babi
Saturday, March 28, 2020 - 18:15

వీళ్లిద్దరూ కలిశారంటే ఆ లెక్క వేరే విధంగా ఉంటుంది. ఎవరు లెజెండ్, ఎవరు సెలబ్రిటీ అనే వివాదం తర్వాత కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత చిరంజీవి, మోహన్ బాబు కలిసిపోయారు. ఎన్నో వేదికలపై ఇష్టంగా కౌగిలించుకున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ సీనియర్లిద్దరూ మరోసారి ఒకరిపై ఒకరు కొంటెగా ట్వీట్లు వేసుకొని అందర్నీ ఎట్రాక్ట్ చేశారు.

చిరంజీవి ట్విట్టర్ లోకి రాగానే మిత్రమా స్వాగతం అంటూ మోహన్ బాబు రీట్వీట్ చేశారు. దానికి కాస్త కొంటెగా స్పందించారు చిరంజీవి. రాననుకున్నావా.. రాలేననుకున్నావా అంటూ తను నటించిన ఇంద్ర సినిమాలో డైలాగ్ గుర్తుచేశారు.

దీనికి మోహన్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతా అంటూ సమాధానం ఇచ్చారు. ఈ కొంటె సమాధానానికి, చిరంజీవి అంతే సరదాగా రిప్లయ్ ఇచ్చారు. మిత్రమా కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పురావాలి.. నో హగ్స్, నో షేక్ హ్యాండ్స్, సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ చమత్కరించారు. అక్కడితో ఆగకుండా మంచు లక్ష్మి చేసిన ఓ వీడియోను షేర్ చేశారు.

ఈసారి మోహన్ బాబు మరింత ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. మిత్రమా మహమ్మారి తాత్కాలికం, మన స్నేహం శాశ్వతం అంటూ ట్వీటారు. ఇలా మెహన్ బాబు, చిరంజీవి మధ్య సరదాగా ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. ఈ ట్వీట్స్ తో అటు కలెక్షన్ కింగ్ అభిమానులు, ఇటు మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు.