గ్యాప్ మెయిoటెయిన్ చేస్తోన్న మహేష్, బన్ని

Gap between Allu Arjun and Mahesh's films
Saturday, August 17, 2019 - 09:45

మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ గొడవలే. ఆన్లైన్ లో ఒకరిపై ఒకరు నెగేటివ్స్ ట్రెండ్ చేస్తుంటారు. రీసెంట్ గా అల్లు అర్జున్ పై చాలా నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. వాటి వెనుక మహేష్ క్యాంపు ఉందని టాక్ నడిచింది. ఎందుకంటే, బన్నీ - త్రివిక్రమ్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది కదా. 

అయితే, అందరూ ఊహిస్తున్నట్లు ఈ రెండు సినిమాలు డైరెక్ట్ పోటీ పడేలా లేవు. సంక్రాంతికి మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', బన్నీ నటిస్తున్న 'అల వైకుంఠపురంలో' బరిలో ఉన్నమాట నిజమే కానీ  రెండు సినిమాల మధ్య నాలుగు రోజుల గ్యాప్ ఉండేలా ఉంది. ఇప్పటికే రెండు సినిమాల నిర్మాతలు మాట్లాడుకుంటున్నారట. ఒక సినిమా 9న, మరోటి భోగి నాడు వచ్చేలా చూస్తున్నారట.

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 9న కానీ జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వైకుంఠపురంలో' జనవరి 13న కానీ, జనవరి 14న కానీ వస్తుంది. రెండు సినిమాల మధ్య మినిమం త్రి డేస్ గ్యాప్ ఉంటుంది. సో రెండు సినిమాలకి ఓపెనింగ్స్ లో కోత పడదు. పైగా సంక్రాంతి సీజన్. ఇద్దరి మధ్య ఈ అండర్ స్టాండింగ్ కనుక కుదిరితే ఇది ఇండస్ట్రీ కి గుడ్ న్యూస్.