సినీ కార్మికులకు జార్జిరెడ్డి సాయం

George Reddy team helps poor cine worker
Sunday, April 5, 2020 - 15:15

లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగులు రద్దు అయ్యాయి. దాంతో సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ఇప్పటికే సినీ పెద్దలు విరాళాలు అందించారు. అయితే ఆ సహాయం కార్డుదారులకే లభించింది. కార్డులు లేని కార్మికులు కూడా ఉన్నారు. వారిని ఆదుకునేందుకు మేము ఉన్నాం అంటూ ముందుకొచ్చింది  ‘జార్జిరెడ్డి’ సినిమా టీం.

 కార్డులేని వంద మంది సినీ కార్మికులకు నూనె, ఉల్లిపాయలు, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులను పది రోజులకు సరిపడా అందించారు. జార్జిరెడ్డి చిత్ర నిర్మాతలు అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దామురెడ్డి, దర్శకుడు జీవన్ రెడ్డి సహా చిత్ర కథానాయకుడు సందీప్ (సాండీ), తిరువీర్, మణికంఠ, జనార్ధన్, సంపత్, సురేష్, సుబ్బరాజు తదితరులు హాజరై కార్మికులకు సరుకులు అందించారు.