ఈసారి వరదలొచ్చిన ఏం పర్లేదు

Gopi Sundar moves to Hyderabad
Wednesday, November 13, 2019 - 14:15

శైలజారెడ్డి అల్లుడు సినిమా టైమ్ లో గోపీసుందర్ చాలా ఇబ్బంది పడ్డాడు. తను ఇబ్బంది పడ్డమే కాకుండా, టోటల్ యూనిట్ ను కూడా టెన్షన్ పెట్టాడు. దీంతో ఒక దశలో సినిమా విడుదల వాయిదా పడుతుందేమో అనుకున్నారంతా. దీనికి కారణం కొచ్చిలో వరదలు. ఆ సినిమా టైమ్ లో కొచ్చిలో వరదలు వచ్చాయి. అదే ఊరిలో రీ-రికార్డింగ్ పెట్టుకున్నాడు గోపీసుందర్. దీంతో అందర్లో ఒకటే టెన్షన్.

ఇకపై గోపీసుందర్ తో వర్క్ చేయాలనుకున్న మేకర్స్ కు ఆ టెన్షన్ లేదు. కొచ్చి వెళ్లి అక్కడే కొన్ని రోజులు ఉండాలనే బాధ లేదు. ఈసారి కొచ్చికి మరోసారి వరదలొచ్చినా టాలీవుడ్ కు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గోపీసుందర్ ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. ఇక్కడ ఏకంగా ఓ రికార్డింగ్ స్టుడియో నిర్మించుకున్నాడు ఈ సంగీత దర్శకుడు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి మూడేళ్ల కిందటి వరకు మలయాళం సినిమాలకే ఎక్కువగా వర్క్ చేశాడు గోపీసుందర్. అయితే మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఊపిరి, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు ఈ సంగీత దర్శకుడ్ని టాలీవుడ్ కు దగ్గర చేశాయి. అదే టైమ్ లో వరుసగా మ్యూజికల్ హిట్స్ కూడా పడ్డాయి. ఇక ఈ ఏడాదైతే తమ మాతృభాష మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువగా వర్క్ చేస్తున్నాడు ఈ కంపోజర్. దీనికి తోడు ఆదాయం కూడా కాస్త పెరగడంతో, మేకర్స్ కు మరింత అందుబాటులో ఉండేందుకు ఇక్కడే ఓ రికార్డింగ్ స్టుడియో పెట్టుకున్నాడు.

ప్రస్తుతం తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, చూసీ చూడంగానే, ఎంతమంచివాడవురా, నిశ్శబ్దం లాంటి సినిమాలకు వర్క్ చేస్తున్నాడు గోపీసుందర్. అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమాకు కూడా ఇతడే మ్యూజిక్ డైరక్టర్. ఇవి కాకుండా మరో 4 సినిమాలు పైప్-లైన్లో ఉన్నాయి. త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు.