ఆ సినిమా ఆగింది.. ఇంకోటి మొదలైంది

Gopichand and Tamannah begin shoot
Sunday, December 15, 2019 - 09:00

గోపీచంద్ కెరీర్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వరుసగా ఫ్లాపులు చూస్తున్న ఈ హీరో, పెరిగిన బడ్జెట్ ను కంట్రోల్ లో పెట్టేందుకు నానా కష్టాలు పడుతున్నాడు. అంతేకాదు, కథల ఎంపికలో కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇందులో భాగంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వంలో ప్రారంభించిన సినిమాను ఆపేసిన గోపీచంద్.. ఇప్పుడు మరో సినిమా మొదలుపెట్టాడు.

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా కొన్ని రోజుల కిందట సినిమా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. అజీజ్ నగర్ లో వేసిన సెట్ లో గోపీచంద్ పై ఈరోజు కొన్ని సీన్స్ పిక్చరైజ్ చేశారు. యూటర్న్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకు నిర్మాత.

పనిలోపనిగా మరో గాసిప్ పై కూడా ఈరోజు క్లారిటీ ఇచ్చింది యూనిట్. ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నాను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుందంటూ గతంలో కొన్ని పుకార్లు వచ్చాయి. అలాంటిదేం లేదని స్పష్టంచేసింది యూనిట్. తమన్న మెయిన్ హీరోయిన్ గా, దిగాంగన సూర్యవంశీ సెకెండ్ హీరోయిన్ గా సినిమా రన్ షూటింగ్ అవుతోందని స్పష్టంచేసింది.

అన్నట్టు ఈ సినిమాలో భూమిక కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా అంటున్నారు. అసలే ఫ్లాపుల్లో ఉన్న మ్యాచో స్టార్ కు భారీ బడ్జెట్ అవసరమా..? గతంలో ఓసారి ఇలానే చేశాడు దర్శకుడు సంపత్ నంది. ఈసారి కూడా భారీగా ఖర్చు చేయిస్తున్నాడు.