గోపీచంద్ కి చెమటలు పడుతున్నాయి

గోపీచంద్ ప్లాపుల దండయాత్ర చేస్తున్నాడు. ఘజిని లాగా అసలు వదలడం లేదు. రీసెంట్ గా ఎవరో లెక్క తీస్తే గోపీచంద్ ఇటీవల ఇచ్చిన ప్లాపుల సంఖ్య అక్షరాలా ఏడు అని తేలిందంట. అయినా గోపీచంద్ బెదరడం లేదు. ఎందుకంటే చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. తీసేవాళ్ళు ఉన్నప్పుడు తనకి పోయేదేముంది?
ఐతే ఇక్కడ ఓ సమస్య ఉంది. ఇప్పుడు సెట్ మీదున్న సినిమాలకి ప్రీ-రిలీజ్ బిజినెస్ కావడం కష్టం. ఇప్పటివరకు ఎలాగెలాగో నెట్టుకొచ్చినా... ఇప్పుడు మాత్రం డెఫిషిట్ ల షీట్ మాత్రమే మిగుల్తుంది. మరో హిట్ కొట్టేంతవరకు అంతే. గోపీచంద్ ఎన్నుకునే కథల్లోనే లోపం ఉంది.
ఒకప్పుడు యాక్షన్ లవర్స్ ని తెగ ఆకట్టుకున్న గోపి ...ఇపుడు ఏ వర్గాన్ని ఇంప్రెస్స్ చేయలేకపోతున్నాడు. గతవారం విడుదలైన 'చాణక్య'కి థియేటర్ల రెంటు డబ్బులు కూడా రాలేదు. ఆ రేంజ్ లో గోపీచంద్ మార్కెట్ పడింది. మరి ఇప్పుడైనా చక్కదిద్దేనా?
- Log in to post comments

























