గోపీచంద్ కి తేజతో తప్పట్లేదు

Gopichand doing Teja's next film Alimelu Manga
Thursday, March 5, 2020 - 10:30

గోపీచంద్ త్వరలోనే తన గురువు తేజ దర్శకత్వంలో నటించనున్నాడు. 'అలిమేలుమంగ వెంకటరమణ' అనే పేరుతో తేజ  ఒక మూవీ ప్లాన్ చేశారు. 'జయం' సినిమాలో విలన్ గా ప్రెజంట్ చేసి తనకి కెరీర్ ఇచ్చిన తేజ అంటే గోపీచంద్ కి అభిమానం ఉంది. ఋణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గోపీచంద్ కెరీర్ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. గోపీచంద్ ని నేటి తరానికి నచ్చే విధంగా కొత్తగా ప్రెజంట్ చేసే కథలు, దర్శకులు కావాలి.

ఇలాంటి టైంలో తేజతో మూవీ చెయ్యడం అంటే రిస్క్. రానా హీరోగా తేజ ఇటీవల 'నేనే రాజు నేనే మంత్రి' వంటి హిట్ ఇఛ్చినా, ఆ తరువాత 'సీత' రూపంలో అపజయం అందించారు. అంటే... తేజతో సినిమా ఇప్పుడు గ్యారెంటీలేని వ్యవహారం. కానీ గురు దక్షిణ గా చెయ్యాల్సిన సినిమా ఇది. అందుకే గోపీచంద్ ఒప్పుకున్నాడట. 

మరి అలిమేలుగా తేజ ఎవరిని తీసుకుంటాడో చూడాలి.