రవితేజ అంటే అందుకే అంతిష్టం

Gopichand Malineni talks about Ravi Teja
Tuesday, April 21, 2020 - 17:15

తొలిసారి ఛాన్స్ ఇచ్చిన హీరో అంటే ఆమాత్రం ఇష్టం, ప్రేమ ఉంటాయి. గోపీచంద్ మలినేనికి కూడా అలాంటి ఇష్టం ఉంది. తనకు ఛాన్స్ ఇచ్చిన రవితేజ అంటే ఈ డైరక్టర్ కు చాలా ఇష్టం. డాన్ శీనుతో దర్శకుడిగా మారిన గోపీచంద్ మలినేని, పూర్తిగా రవితేజను దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా కథ రాశానంటున్నాడు.

"రవితేజను ఆన్ స్క్రీన్ పైన ది బెస్ట్ గా చూపించిన డైరక్టర్ నేనే అంటుంటారు చాలామంది. దాన్ని నేను కాంప్లిమెంట్ గా తీసుకుంటాను. రవితేజ అంటే నాకిష్టం. రవితేజ గారు నాకు లైఫ్ ఇచ్చిన హీరో. కాబట్టి ఆ ఇష్టం ఎప్పటికీ పోదు. డాన్ శీను సినిమా కథను రవితేజను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాను. ఎక్కువ మంది డైరక్టర్లకు ఇష్టమైన హీరో ఆయన. రవితేజతో నాకు బాగా కంఫర్ట్ గా ఉంటుంది. రవితేజకు కూడా అంతే. సో.. మంచి ఔట్ పుట్ వస్తుంది."

కొత్తగా ఏ కథ స్టార్ట్ చేసినా తనకు ముందుగా రవితేజ మాత్రమే గుర్తొస్తారని అంటున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే రవితేజతో డాన్ శీను, బలుపు సినిమాలు చేసిన గోపీచంద్ మలినేని.. ప్రస్తుతం అతడితో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో రవితేజను మరింత ఎనర్జిటిక్ గా చూపిస్తున్నానని చెబుతున్నాడు గోపీచంద్ మలినేని.