అనుపమని క్లీన్‌బౌల్డ్ చేసిన‌ బుమ్రా?

Gossip about Anupama and cricketer Jasprit Bumrah
Tuesday, June 11, 2019 - 19:45

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కెరియ‌ర్ ఫాస్ట్‌గా ప‌రుగులెట్ట‌డం లేదు. ఇంకా చెప్పాలంటే డెడ్ స్లోగా ఉంది. ఐతే ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా ఫాస్ట్‌గా ట‌ర్న్ తీసుకుంటున్న‌ది. ఆమె దిల్ పిచ్‌పై బుమ్రా బంతులు తిరుగుతున్న‌ట్లు ఇంట‌ర్నెట్‌లో వార్త‌లు తిరుగుతున్నాయి.

అ ఆ, ప్రేమం, శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే సినిమాల్లో నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా  క్రికెటర్ బుమ్రాకి క్లీన్‌బౌల్డ్ అయింద‌నేది గుసగుసలు మొదలయ్యాయి. ఈ 
మాట‌లు చాలా కాలంగా వినిపిస్తున్న మాట నిజ‌మే కానీ తాజ‌గా వీరిద్ద‌రూ సోష‌ల్ మీడియాలో ఓ తెగ లైకులేసుకుంటూ అంద‌రి కంట ప‌డ్డారు. ఇద్దరూ ఒక‌రినొక‌రు ఫాలో అవుతుండడం, ఒకరి పోస్ట్‌ల‌కి ఒకరు లైక్లు కొడుతుండడంతో ఈ ప్రచారం ఊపందుకొంది. బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ అనుపమనే.

గుజ‌రాత్‌కి చెందిన బుమ్రాకి, కేర‌ళ‌కి చెందిన అనుప‌మ‌కి మ‌రి ఎలా లింక్ కుదురుతుంది చెప్పండి. ఏదీ ఏమైనా... సినిమా హీరోయిన్ల‌కి, ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌కి ఉన్న ప్ర‌త్యేక‌మైన క్ర‌ష్‌, ల‌వ్వు గురించి స్పెష‌ల్‌గా చెప్ప‌క్క‌ర్లేదు.

అనుప‌మ ప్ర‌స్తుతం బెల్లంకొండ స‌ర‌స‌న "రాక్ష‌సుడు" అనే సినిమాలో న‌టిస్తోంది.