ప్రభుత్వాల మాటకి విలువుందా?

Government flip flops on ticket rates
Thursday, August 29, 2019 - 23:45

సాహో సినిమా టికెట్‌ ధరలు అన్నిచోట్లా పెరిగాయి. ఏపీలోనూ, తెలంగాణలోనూ సేమ్‌ సీన్‌. మేం ఏ సినిమాకీ పక్షపాతం చూపం. అన్ని సినిమాలకి ఒకే రేట్లు వర్తిస్తాయి అని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గొప్పగా డబ్బా కొంటున్నాయి. కానీ ప్రతి పెద్ద సినిమా విడుదలవుతున్నపుడు రేట్లు పెంచడం, అమ్మడం అనే తంతు మారడం లేదు. అధికారికంగా మేం ఏ థియేటర్‌కి పర్మిషన్‌ ఇవ్వలేదనేది ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. మరి రేట్లు ఎలా పెరుగుతున్నాయంటే... కొన్ని థియేటర్లు అప్పుడెపుడో హైకోర్టుకి వెళ్లి ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నాయనే సాకు చూపుతున్నారు. టికెట్‌ రేట్లు ఎంతుండాలో (ఎగ్జిక్యూటివ్‌ వ్యవహారం) కోర్టులు (జ్యుడిషియరీ) నిర్ణయించడమనేదే ఒక వింత. దానికి ప్రభుత్వాల లోపాయకారీ వంత. సబ్‌ మిలా హై!

ఇది సాహో సినిమాతోనే మొదలుకాలేదు. దీనితోనే ఎండ్‌ అవదు. బాహుబలి సినిమా నుంచి ప్రతి పెద్ద సినిమా విడుదలైనపుడు ఇదే పద్దతి కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌ పెట్టాం కాబట్టి మేం ఎక్కువ రేట్లకి అమ్ముతామంటున్నారు మేకర్స్‌. ఎవరైనా వచ్చి ఏ హీరోని కానీ, డైరక్టర్‌ని కానీ మీరు ఇన్ని కోట్లు పెట్టి తీయండి లేకపోతే మేం ఊర్కోం అని ఏమైనా చెప్పారా... మీ సెల్ప్‌ డబ్బాకి, మీ ఫాల్స్‌ ఇమేజ్‌లకి భారీగా ఖర్చు పెట్టి, జనం మీద టికెట్ల రేట్లు రుద్దడం..దానికి వింత వాదనలు తీసుకురావడం జరుగుతోంది. 

ప్రభుత్వ పెద్దల సైలెంట్‌ సహకారం లేకుండా ఇదంతా జరుగుతుందని నమ్మడం గొర్రెతనం.