రామోజీరావు ఇంట్లో పెళ్లి సంద‌డి

Grand wedding preparations for Ramoji Rao's grand daughter
Tuesday, July 4, 2017 - 18:45

ప్ర‌ముఖ నిర్మాత‌, మీడియో మొఘ‌ల్ రామోజీరావు ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లుకానుంది. రామోజీ రావు పెద్ద కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్  కూతురు పెళ్లి ఈ నెల 28న జ‌ర‌గ‌నుంది. అఫ్‌కోర్స్ పెళ్లి వేదిక‌..ఫిల్మ్‌సిటీలోనే. మూడు రోజుల పాటు ఘ‌నంగా పెళ్లి వేడుకలు ఉంటాయట‌. సంగీత్‌కి బాలీవుడ్‌, టాలీవుడ్ స్టార్స్‌తో డ్యాన్స్‌లు చేయిస్తార‌ని టాక్‌. ఇప్ప‌టికే కొంద‌రు తార‌ల‌ను సంప్ర‌తించార‌ట‌. ఫిల్మ్‌సిటీలో ఆ మూడు రోజులు పాటు సినిమా షూటింగ్‌లు బంద్‌.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకి కిరణ్ ఇప్ప‌టికే వెడ్డింగ్ కార్డ్‌లు అంద‌చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రామోజీరావు ఆహ్వాన ప‌త్రిక అంద‌చేస్తార‌ట‌. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో పాటు దేశంలోని ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు, ఫిల్మ్ స్టార్స్ ఈ వేడుక‌కి హాజ‌రు కానున్నారు.