దీపిక, రణవీర్ పెళ్లిసందడి ఇలా!

బాలీవుడ్ అందమైన జంట రణవీర్ సింగ్, దీపిక పదుకొనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వారిద్దరూ ఇటలీ చేరుకున్నారు. వారిది డెస్టినేషన్ వెడ్డింగ్. వారి పెళ్లి వేడుకలు, వారి ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
వేదిక - లేక్ కోమా
ఇటలీ దేశంలోని లేక్ కోమో అనే ప్రాంతంలో విల్లా డెల్ బాల్బియానెల్లో అనే రిసార్ట్‌లో దీపికా రణ్‌వీర్‌ల వివాహం జరగనుంది.
వేడుకలు...
నవంబర్ 13: సంగీత్ వేడుకలు
నవంబర్ 14, 15: ఈరెండు తేదీల్లో వివాహం. మొదటి రోజు దక్షిణాది సంప్రదాయ పద్దతిలో హిందూ వివాహ వేడుక. 15వ తేదీ పంజాబీ సంప్రదాయంలో పెళ్లి, ఆ తర్వాత 15 సాయంత్రం రిసెప్సన్.
నవంబర్ 18: మ ముంబాయికి తిరిగి రక
వంబర్ 21: దీపిక సొంత నగరం బెంగుళూర్‌లో రిసెప్సన్.
నవంబర్ 28: మ ముంబైలో బాలీవుడ్ అతిథుల కోసం భారీ రిసెప్సన్. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌ని బుక్ చేశారు.
డిసెంబర్ 1: హనీమూన్ ట్రిప్పు.
ఎవరెవరికి ఆహ్వానం అందింది
డెస్టినేషన్ వెడ్డింగ్‌కి అందరికీ ఆహ్వానం ఉండదు. జనరల్‌గా కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రులకి మాత్రమే పిలుపు ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులను మినహాయిస్తే 30 మంది ఇతర అతిథులను పిలిచారట. బాలీవుడ్ నుంచి దీపిక పదుకొనే తొలి చిత్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్, తొలి చిత్ర దర్శకురాలు ఫరాఖాన్‌కి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇక దీపిక, రణవీర్‌తో వరుసగా మూడు సినిమాలు తీసిన సంజయ్ లీలా భన్సాలీని కూడా ప్రత్యేకంగా పిలిచారు. వీరితో పాటు రణవీర్ సింగ్‌ని పరిచయం చేసిన నిర్మాత ఆదిత్య చోప్రాకి కూడా ఆహ్వానం అందిందిట.
హానీమూన్ డెస్టినేషన్
దీపిక, రణవీర్‌ల హానీమూన్ ట్రిప్పు ఖాయమైంది. హానీమూన్ నుంచి వచ్చిన తర్వాతే రణవీర్ సింగ్ తన కొత్త సినిమా సింబా ప్రమోషన్‌లలో పాల్గొంటాడట. ఐతే వీరి హనీమూన్ ఏ దేశానికి, ఏ ప్రాంతానికి వెళ్తున్నారనేది రహస్యంగా ఉంచుతున్నారట.
చీరలో పెళ్లికూతురు
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ .దీపిక పెళ్లికి కట్టుకునే చీరని డిజైన్ చేశాడు. చీర ఖరీదు అక్షరాలా 10 లక్షల రూపాయలట. గత రెండు నెలలుగా దీపిక చీరని రెడీ చేస్తున్నాడు సబ్యసాచి.
పెళ్లి తర్వాత అక్కడే కాపురం
దీపిక ప్రస్తుతం ముంబైలో ఒక లగర్జీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా ఇక్కడే కాపురం పెడుతుందట. కొన్నాళ్ల తర్వాత ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్‌ని కొంటారట.
- Log in to post comments