హారికకి తప్పని మరో భారం

Haarika Haasine teams up with Kalyan Ram
Wednesday, February 19, 2020 - 10:30

జులాయి సినిమా నుంచి త్రివిక్రమ్ హారిక హాసిని సంస్థకి తప్ప మరో నిర్మాతకి, బ్యానర్ కి మూవీ చెయ్యడం లేదు. హీరో ఎవరు అయినా, బ్యానర్ మాత్త్రం హారిక హాసిని మాత్రమే. ఐతే, 'అల వైకుంఠపురంలో' సినిమాకి బన్నీ అంబర్ ఫిట్టింగ్ పెట్టాడు. హారికతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉండాల్సిందే అని పట్టు పట్టాడు. ఈ ఒక్క సినిమాకే అని ఒప్పుకున్నారు. కానీ ఒకసారి లొంగితే అంతే. అదే ఇప్పుడు జరుగుతోంది. 

త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ హీరో గా. ఈ వేసవి తర్వాత షూటింగ్ మొదలు అవుతుంది. ఈ సినిమాని కూడా హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తారు. అయితే, ఈ బ్యానర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఉంటారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా హారికతో కలిసింది. సేమ్ ... 'అల వైకుంఠపురములో' కి జరిగినట్లే. ఇకపై హారిక ఇవే కాంబినేషన్లు ఉంటాయి. పెద్ద హీరోలు అందరికి సొంత నిర్మాణ సంస్థలున్నాయి కాబట్టి పార్టనర్ షిప్ అడుగుతారు. 

ఇక హారిక సోలో బ్యానర్ గా సినిమాలు చెయ్యడం ఇప్పట్లో ఉండదేమో. హీరోకి పారితోషికంతో పాటు నిర్మాణంలో వాటా ఇవ్వాలిసిందే. .