సమంత బాటలో హన్సిక

Hansika to do heroine-centric movies
Saturday, November 3, 2018 - 23:30

పెళ్లి తర్వాత సినిమాల సెలక్షన్ విషయంలో సమంత మారిపోయిన విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందే హన్సిక మారిపోయింది. ఇకపై గ్లామర్ డోస్ తగ్గిస్తానంటోంది, తన పాత్రకు ప్రాధాన్యం ఉండే సినిమాలు మాత్రమే చేస్తానంటోంది. 

ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. అటు తమిళ్ లో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది. ఇవి కంప్లీట్ అయిన తర్వాత క్యారెక్టర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని అంటోంది హన్సిక. పూర్తిగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేయకపోయినా, కనీసం తన పాత్ర వరకు కాస్త ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ ను ఎంచుకుంటానని చెబుతోంది.

హన్సిక తీసుకున్న నిర్ణయమైతే మంచిదే. కాకపోతే ఆమెకు కాస్త వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ వస్తాయా అనేది సందేహం. ఎందుకంటే, తెలుగులో కాకుండా తమిళ్ లో కూడా హన్సికకు గ్లామర్ డాల్ ఇమేజ్ ఉంది. ఈ ఆపిల్ బ్యూటీ బరువైన పాత్రల్ని మోస్తుందనే నమ్మకం ఎవరికి ఉంటుంది? ముందు ఎవరో ఒకరు ఈమెతో ఓ ప్రయోగం చేయాలి. అది సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత మాత్రమే హన్సిక అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.